Electronics5th Jun 09:04 AMSunil Byrisetty1 min read

టాటా న్యూ ఈవీ.. అదిరే ఫీచర్స్!

ఈవీ ఫోర్ వీలర్స్ లో టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి కొత్త కారు రాబోతోంది. టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో రానుంది. ఒక్కసారి ఛార్జ్ చే

టాటా న్యూ ఈవీ.. అదిరే ఫీచర్స్!
ఈవీ ఫోర్ వీలర్స్ లో టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి కొత్త కారు రాబోతోంది. టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో రానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 627 కిలోమీటర్ల ప్రయాణం దీని సొంతం. టాటా లైనప్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తున్న ఏకైక మోడల్ గా ఇది అందుబాటులోకి వస్తోంది. జూలై 2 నుంచి అధికారికంగా బుకింగ్స్ మొదలు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. అధునాతన ఫీచర్లతోపాటు, 540-డిగ్రీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్, డ్రైవ్‌ట్రెయిన్, డిజైన్ ఆకట్టుకున్నాయి. డాష్‌బోర్డులో భారీ 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ కాగా, దీనికి తోడుగా 12.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ (Neo QLED) స్క్రీన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ చెబుతోంది.
Tata Motors
EV four-wheelers
Tata Harrier electric SUV
540-degree camera
ఈవీ ఫోర్ వీలర్స్
ఫ్లాగ్లిప్ ఎస్ యూవీ
Scroll for the next article