Automobiles30th Nov 11:46 AMSunil Byrisetty2 min read
టాటా సియెర్రా ఐకానిక్ మోడల్.. ఫీచర్లివే!
20 ఏళ్ల తర్వాత టాటా మోటార్స్ సియెర్రా పేరుతో కొత్త SUVని లాంచ్ చేసింది. పాత లుక్ తో పాటు ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కారు ధర రూ. 11.49 లక్షల నుంచి మొదలవుతుంది. 7 వేరియంట్లు, మూడు ఇం
20 ఏళ్ల తర్వాత టాటా మోటార్స్ సియెర్రా పేరుతో కొత్త SUVని లాంచ్ చేసింది. పాత లుక్ తో పాటు ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కారు ధర రూ. 11.49 లక్షల నుంచి మొదలవుతుంది. 7 వేరియంట్లు, మూడు ఇంజిన్ ఆప్షన్స్, 6 కలర్స్‌తో పాటు, కో-డ్రైవర్ స్క్రీన్, 12 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లు దీని సొంతం. టాటా సియెర్రా ప్రారంభ ధర ఎక్స్-షోరూం రూ. 11.49 లక్షలుగా ఉంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టొయోటా హైరైడర్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ వంచి వాటితో టాటా సియెర్రా పోటీ పడుతుంది.
టాటా సియెర్రా మొత్తం 7 వేరియంట్స్ లో రిలీజ్ అయింది. స్మార్ట్ +, ప్యూర్, ప్యూర్ +, అడ్వెంచర్, అడ్వెంచర్ +, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ + వేరియంట్స్ ఉన్నాయి. 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ విత్ 106 హార్స్‌పవర్. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్ బాక్స్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విత్ 160 హార్స్‌పవర్. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 118 హార్స్‌పవర్. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్స్ ఉన్నాయి. టాటా సియెర్రా మొత్తం 6 కలర్స్ లో లభిస్తుంది. అండమాన్ అడ్వెంచర్, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్స్, మున్నార్ మిస్ట్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ తో ఉంటాయి. లోపల బీజ్ మరియు బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా ప్రీమియం లుక్ ఇస్తోంది. 10.25 అంగుళాల డ్రైవర్ డిస్ప్ ప్లేలో క్రిస్ప్ గ్రాఫిక్స్. హారియర్, సఫారీ, కర్వ్ లాంటి యూనిట్. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. 12.3 అంగుళాల కో-డ్రైవర్ స్క్రీన్ కో డ్రైవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగించవచ్చు.