Health18th Jan 11:56 AMSunil Byrisetty1 min read
తాటీ తేగలు.. దొరికితే వదలకండి !
తాటి కాయల నుంచి లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటి గురించి తెలిసిన చాలా మంది పెద్దలు ఎక్కడ తేగలు కనిపించినా
తాటి కాయల నుంచి లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటి గురించి తెలిసిన చాలా మంది పెద్దలు ఎక్కడ తేగలు కనిపించినా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో తేగలు విరివిగా లభిస్తున్నాయి. తేగల ఖరీదు చవకే. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన తేగలను అస్సలు వదలొద్దు. తాటి చెట్లకు ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కాయలు కాస్తాయి. ఏప్రిల్, మే మాసాల్లో ముంజలు వస్తాయి. జూన్, జూలై మాసాల్లో చెట్లకు ఉన్న తాటి కాయలు పండ్లుగా తయారవుతాయి. అలా తయారైన పండ్లు చెట్ల నుంచి రాలిపోతాయి. ఒక్కొక్క కాయకు మూడేసి గింజలు చొప్పున ఉంటాయి. అలా రాలిన పండ్లను కొందరు సేకరించి నేలలో గొయ్యి తీసి పూడుస్తారు. అలా పూడ్చిన పండు నుంచి మొలకలు వచ్చి, అవి ఊరి, తేగలుగా తయారయ్యేందుకు మూడు మాసాలు పడుతుంది. అలా తయారైన తేగలను గింజల నుంచి వేరు చేసి, కుండల్లో పెట్టి బట్టీలా పేర్చి కాల్చుతారు. కుండ చల్లారిన తర్వాత కాలిన తేగలను సేకరిస్తారు. అలా సేకరించిన తేగలను కట్టలు కట్టి, మార్కెట్‌లో విక్రయించుకొని చాలా మంది జీవిస్తుంటారు.