News11th Jan 01:13 PMSunil Byrisetty1 min read

బడ్జెట్‌లో బిల్డర్లకు శుభవార్త!

సామాన్యుడి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గృహ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు

బడ్జెట్‌లో బిల్డర్లకు శుభవార్త!
సామాన్యుడి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గృహ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసినట్లుగా సమాచారం. బిల్డర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అవకాశం కనిపిస్తోంది. నీతి ఆయోగ్ చేసిన సిఫార్సుల్లో అత్యంత ప్రధానమైనది సెక్షన్ 80-IBA కింద బిల్డర్లకు 100 శాతం పన్ను మినహాయింపును పునరుద్ధరించడం ఉంది. గతంలో అమలులో ఉన్న ఈ వెసులుబాటు గడువు ముగియడంతో, డెవలపర్లు చిన్న, మధ్యతరగతి గృహాల నిర్మాణంపై ఆసక్తి తగ్గించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ మినహాయింపును ఇవ్వడం ద్వారా, బిల్డర్ల నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని బిల్డర్లు నేరుగా కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది, తద్వారా మార్కెట్‌లో ఇళ్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం లగ్జరీ ఇళ్ల వైపు మళ్లుతున్న తరుణంలో, ఈ పన్ను రాయితీలు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి.
Union Budget
Builders Relief
Real Estate Sector
NITI Aayog Proposals
Section 80-IBA
Tax Exemptions
Affordable Housing
ఇళ్ల ధరలు
ఇండియా ఆర్థిక వ్యవస్థ
హౌసింగ్ పాలసీ
Scroll for the next article