News28th Mar 11:25 AMSunil Byrisetty1 min read

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు

రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృష్ణాజిల్లా మోపిదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. కు

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు
రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృష్ణాజిల్లా మోపిదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు దంపతులకు దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి నాగపుట్టలో పాలు పోసి పూజలు చేశారు. గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చరిత్రను అర్చకులు వివరించారు. మోపిదేవి క్షేత్ర వైభవం గురించి, అక్కడ జరిగే విశేష పూజలను తెలిపారు.
Acham Naidu
Mopidevi
Subramanya Swamy Temple
Scroll for the next article