News20th May 05:46 PMSunil Byrisetty1 min read

అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడులో కలకలం

అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడులో కలకలం రేగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతుండగా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సభలోనే విషద్రావకం తాగిన వెంకటేశులు ఆత్మహత్యాయత్నం చ

అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడులో కలకలం
అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడులో కలకలం రేగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతుండగా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సభలోనే విషద్రావకం తాగిన వెంకటేశులు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సీ సెల్ అనంతపురం నగరాధ్యక్షుడిగా ఉన్న వెంకటేశులు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్టీలో కష్టపడ్డ వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన చెందాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ని ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటి నుంచి నురుగ రావడంతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి తరలించారు.
Anantapur
mini Mahanadu
MLA Daggupati Venkateswara Prasad
TDP activist attempted suicide
అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడు
కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
Scroll for the next article