Politics10th Nov 01:00 PMSunil Byrisetty1 min read
వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలా.. టీడీపీ, వైసీపీ చెప్పిందిదే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ ఒకే తరహా ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే టీడీపీ,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ ఒకే తరహా ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీ.. ఒక విషయంలో మాత్రం ఒకే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. నాయకుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయొద్దు. మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దు. వ్యక్తిగత విషయాలను రాజకీయ విమర్శలకు ఆయుధాలుగా వాడొద్దని రెండు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేశాయి. నిజంగా ఇది స్వాగతించాల్సిన పరిణామం. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ఉండాలి.. ప్రశ్నలు ఉండాలి.. వాదోపవాదాలు ఉండాలి. కానీ అవి విధానాల మీద ఉండాలి, పాలన మీద ఉండాలి, ప్రజా సమస్యల మీద ఉండాలి. అయితే రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రకటనలకే పరిమితం కాకూడదు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కచ్చితంగా పాటించేలా చూడాలి. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి.