Politics14th Jul 01:09 PMSunil Byrisetty1 min read

స్థానిక సన్నాహాలు.. కూటమి పార్టీల భేటీ!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధం కాబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో

స్థానిక సన్నాహాలు.. కూటమి పార్టీల భేటీ!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధం కాబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమావేశం కానున్నారు. రేపు ఒక కీలక సమావేశం నిర్వహించి, సీట్ల పంపకాలు, పొత్తు ధర్మం, పార్టీల మధ్య సహకారంపై చర్చించనున్నారు. ఎన్నికల బరిలో పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి రెండేళ్ల పాలనకు ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ గా మారనున్నాయి.
Andhra Pradesh
Local Body Elections
NDA Alliance
TDP
BJP
Jana Sena
Chandrababu Naidu
పొత్తు ధర్మం
ఏపీ రాజకీయాలు
స్థానిక ఎన్నికలు
కూటమి సమావేశం
Scroll for the next article