Politics17th Jul 03:06 PMSunil Byrisetty1 min read

అరగంట టైం ఇస్తే అంతు తేలుస్తాం

కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్‌లతో జగన్ మాట్లాడిస్తున్నారని టిడిపి నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు కృషి వల్ల ఎపికి అనేక

అరగంట టైం ఇస్తే అంతు తేలుస్తాం
కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్‌లతో జగన్ మాట్లాడిస్తున్నారని టిడిపి నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు కృషి వల్ల ఎపికి అనేక మంది పెట్టుబడి దారులు వస్తున్నారన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వంశీ నివాసంలో వారంతా కలిసి రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం‌ కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసిపి సైకోలు ఆలోచన చేస్తున్నారన్నారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క, రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. నాడు నా భార్యను అరెస్ట్ చేయకుండా చంద్రబాబు ఆపారని చెప్పిన నువ్వేనని, ఇప్పుడు జగన్ డైరెక్షన్ లో నీచంగా మాట్లాడతావా అని మండిపడ్డారు. కొడాలి నాని, వంశీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాత్రి సైగ చేయాలా... రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నాయా.. మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి ఏమిటో తేలుస్తామని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
Ap politics
TDP
Budhha venkanna
Perni nani
Ycp
kodali nani
అరగంట టైం ఇస్తే అంతు తేలుస్తాం
Scroll for the next article