Politics14th Aug 12:23 PMSunil Byrisetty1 min read
పులివెందుల జడ్పీటీసీగా లతా రెడ్డి విజయం
పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి లతా రెడ్డి అధికారిక పత్రం అందుకున్నారు. తన విజయం పట్ల లతా రెడ్డి సంతోషం
పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి లతా రెడ్డి అధికారిక పత్రం అందుకున్నారు.
తన విజయం పట్ల లతా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తన గెలుపు కోసం శ్రమించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.