Politics10th Mar 04:57 PMSunil Byrisetty1 min read
ఎంఎల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని జనసేన పార్టీ అభ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ ముగ్గురు అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం ఐదు స్థానాలకు నామినేషన్లను దాఖలు చేసినట్లయింది.
తొలుత టీడీపీ ముగ్గురు అభ్యర్థులు బీద రవిచంద్ర, బి.టి.నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా, తదుపరి బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.
తదుపరి ఈ నలుగురు అభ్యర్థులు తమ రెండో సెట్టు నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు.
రాష్ట్ర శాసన సభ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.
రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి పత్రాలను పూర్తిగా పరిశీలించి, భారత సంవిధానపు 173 (ఎ) పరచ్చేదము ప్రకారం ఒక్కొక్కరితో ప్రతిజ్ఞ చేయించారు.