News6th Aug 11:50 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఫోక్

టీడీపీ అధినేత ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో సమీక్షించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై పలు విధానాల్లో ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2 స

ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఫోక్
టీడీపీ అధినేత ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో సమీక్షించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై పలు విధానాల్లో ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2 సర్వేల రిపోర్టు ఆధారంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా నివేదికల ఆధారంగా పనితీరు ప్రాతిపదికన ఎమ్మెల్యేలను జోన్లుగా విభజించారు. రిపోర్టులో రెడ్ జోన్లో ఉన్న 20 మందితో ఇప్పటికే రివ్యూ నిర్వహించారు. త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకునందుకు 3నెలలు సమయం ఇస్తున్నారు. అయినప్పటికీ మార్పు రాకపోతే చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Andhra Pradesh politics
TDP
Chandrababu Naidu
MLA performance review
TDP survey report
Red zone MLAs
IVRS feedback
Intelligence report
ఎమ్మెల్యేలు పనితీరు
ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్
Scroll for the next article