Politics14th Nov 10:38 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారమహోత్సవం
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. గురువారం మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని పద్మశాలి బహుత్తమ సంఘం కల్యాణ మండ
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. గురువారం మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని పద్మశాలి బహుత్తమ సంఘం కల్యాణ మండపంలో నూతన మండల, పట్టణ కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డ్, గ్రామ, అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు అన్ని కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి వారికి అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, ప్రజలకు విశ్వసనీయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. నూతన కార్యవర్గంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ వివిధ కమిటీలలో నియమితులైన వారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.