News25th Aug 04:25 PMSunil Byrisetty1 min read

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదే

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీ

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ 1995లో రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బలహీన వర్గాలకు 20 శాతం రిజర్వేషన్ సరిపోదని, సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. నాటి నుంచి 1995, 2001, 2009, 2013లో ఈ రిజర్వేషన్లు పోలేదని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకే 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయో వైసీపీ బీసీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బలహీన వర్గాల గురించి మాట్లాడాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో హడావుడిగా ఎన్నికలు తెచ్చి బీసీలకు అన్యాయం చేశారని, అందువల్ల బీసీలకు 16000 పదవులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి చట్టం ప్రకారం 34 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచి జీవో ఇచ్చామని అచ్చెన్నాయుడు వివరించారు.
Andhra Pradesh
TDP
BC Reservation
34 Percent Reservation
Local Body Elections
Kinjarapu Atchannaidu
Chandrababu Naidu
Telugu Desam Party
బీసీ సంక్షేమం
ఏపీ ప్రభుత్వం
స్థానిక ఎన్నికలు
రిజర్వేషన్ విధానం
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏపీ పాలిటిక్స్
Scroll for the next article