Politics8th Oct 03:22 PMSunil Byrisetty1 min read

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం

మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులు సమాయ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమై, ఏపీలో కూటమిగా ఉన్నందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కోరితే, మద్దతివ్వవచ్చని సూచించినట్లు సమాచారం.
Andhra Pradesh
TDP
Jubilee Hills by-election
Maganti Gopinath
Chandrababu Naidu
Telangana politics
BJP alliance
TDP decision
bypoll
టీడీపీ నిర్ణయం
తెలంగాణ టీడీపీ
ఉపఎన్నిక పోటీ
జూబ్లీహిల్స్
Scroll for the next article