Politics29th May 09:50 AMSunil Byrisetty1 min read
*డిజిటల్ వారియర్స్ @ టీడీపీ*
తెలుగుదేశం పార్టీ ఇటీవల డిజిటల్ విభాగాలపై దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఫేక్ వీడియోలు, పోస్టులన
తెలుగుదేశం పార్టీ ఇటీవల డిజిటల్ విభాగాలపై దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఫేక్ వీడియోలు, పోస్టులను సమర్థంగా తిప్పికొట్టడం కోసం 'డిజిటల్ వారియర్స్'ను రంగంలోకి దించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ ఇలా డిజిటర్ వారియర్స్ సేవలను ఉపయోగించుకోబోంది. వదంతులు, ఫేక్ న్యూస్‌కు సంబంధించిన నిజానిజాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ వారియర్స్ పని చేయబోతున్నారు. అంతేకాకుండా, సరైన సమాచారాన్ని కూడా వీరు సేకరిస్తారు.
ప్రస్తుత రోజుల్లో విపరీతంగా పెరిగిపోయిన డిజిటల్ నేరాలు, ఫేక్ సమాచారాన్ని అరికట్టడానికి వారియర్లు అవసరం. అందుకే డిజిటల్ వారియర్లను టీడీపీ రంగంలోకి దించింది. ఏఐ సహాయంతో ఎన్నో రకాల ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి కొంతమంది వ్యక్తులు పైశాచికానందం పొందుతున్నారు. ఇలాంటివాటిని ఎదుర్కొని, నిజమైన సమాచారం, విశ్వసనీయమైన డేటాను ప్రజలకు అర్థవంతంగా అందించడమే ఈ వారియర్లు చేసే ముఖ్యమైన పని.
డిజిటల్ వారియర్స్' రెజిస్ట్రేషన్లకోసం తెలుగుదేశం పార్టీ.. మహానాడును వేదికగా చేసుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే పార్టీ కార్యకర్తలు, ప్రజలను పార్టీకి అనుసంధానం చేస్తూ 'డిజిటల్ వారియర్స్'గా రిజిస్టర్ చేసుకుంది. ఇందుకోసం ప్రత్యక టీం మహానాడులో పనిచేసింది. మహనాడు తొలి రెండు రోజుల్లో మొత్తం 10,000 మందికి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు సంబంధిత టీం తెలియజేసింది.