Politics29th Mar 03:34 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లో పెనుసంచలనం.. టీడీపీ ఆవిర్భావం
రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక పెను సంచలనమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ
రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక పెను సంచలనమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క తెలుగుదేశానికే దక్కిందని తెలిపారు. నాడు రాష్ట్రంలో పరిస్థితులు చూశాక హైదరాబాద్ వేదికగా తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటకించారని గుర్తు చేశారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యవస్థాకులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘నా ప్రాణసమానమైన తెలుగుదేశం కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. ఆనాడు ఎన్టీఆర్ చైతన్యరథంతో వీధుల్లోకి వెళితే 9 నెలలు ఆయనకు అండగా రాత్రింబవళ్లు కార్యకర్తలు పనిచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా 208 రోజులు, 2,817 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేస్తే నాకు అండగా నిలబడ్డారు. యువగళం పేరుతో నారా లోకేష్ 226 రోజులు, 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2024లో అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి కార్యకర్తలు నీరాజనం పలికార’ని పేర్కొన్నారు.