Politics8th Mar 11:24 AMSunil Byrisetty1 min read

టీడీపీలో ఎమ్మెల్సీలు ఎవరికి?

రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిల్లో ఓ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక మిగిలిన నాలుగు సీట్లల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇటీ

టీడీపీలో ఎమ్మెల్సీలు ఎవరికి?
రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిల్లో ఓ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక మిగిలిన నాలుగు సీట్లల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇటీవలే రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో బీజేపీకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో ఈ నాలుగు స్థానాల్లో ఎస్సీ, బీసీ, ఓసీ కాంబినేషన్ ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సందర్భంలో మైనార్టీ కోటా ఏమైనా ఉంటుందా..? అనేది చూడాలి. సీనియర్ల విషయానికొస్తే.. రెడ్డి సుబ్రమణ్యం, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బీదా రవిచంద్రయాదవ్, మంతెన సత్యనారాయణ రాజు, పిఠాపురం వర్మ, ప్రతిభా భారతి, జవహర్, పీతల సుజాత, నాగుల్ మీరా, జలీల్ ఖాన్, జంగా కృష్ణమూర్తి, కొమాలపాటి శ్రీధర్ ఇలా చాలా మంది ఆశావహులు ఉన్నారు. జూనియర్ల విషయానికి వస్తే.. కావలి గ్రీష్మ, మద్దిపట్ల సూర్యప్రకాష్, బీవీ వెంకట రాముడు, గొట్టిపాటి రామకృష్ణ, వంగవీటి రాధా ఇలాంటి వారు కన్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి సీటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
TDP MLC
TDP MLC Elections 2025
Andhra pradesh
టిడిపి ఎమ్మెల్సీ
టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికలు 2025
Scroll for the next article