News20th May 01:17 PMSunil Byrisetty1 min read
మహానాడు కోసం 19 కమిటీలు ఏర్పాటు
కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్టహాసంగా నిర్వహించే పసుపు పండుగ నిర్వహణ కోసం 19 కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అట్టహాసంగా నిర్వహించే పసుపు పండుగ నిర్వహణ కోసం 19 కమిటీలను ఏర్పాటు చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తెలంగాణ నేత బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీని నియమించారు.
మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
అలాగే మాజీ మంత్రి యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, మంత్రి అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీలను నియమించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు.
అలాగే పలువురు సీనియర్ల నేతృత్వంలో ఇతర కమిటీలను వేశారు.