Politics9th Oct 04:20 PMSunil Byrisetty1 min read
బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయే
బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర
బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతికి నందమూరి తారక రామారావు పునాదులు వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కార్యక్రమాలను కొనసాగించారని తెలిపారు. 1987లో నందమూరి తారక రామారావు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో దేశంలోనే తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తుచేశారు. 1996లో సీఎం చంద్రబాబు ఆ రిజర్వేషన్లను దాదాపు 34 శాతానికి పెంచి బీసీలకు ఆత్మస్థైర్యం కల్పించారని పేర్కొన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చాయని తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 24 శాతం రిజర్వేషన్లే మిగిలేలా చేసి వారి హక్కులను హరించారని అన్నారు.