Politics10th Aug 03:56 PMSunil Byrisetty1 min read
జనార్దన్, బాలినేనికి అధిష్టానం ఆదేశాలు
టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్య తాజా వివాదంపై ఇరు పార్టీలు స్పందించాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వ్యవహారంపై రెండ
టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్య తాజా వివాదంపై ఇరు పార్టీలు స్పందించాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వ్యవహారంపై రెండు పార్టీల హైకమాండ్లు సీరియస్ అయ్యాయి. కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యుల మధ్య టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నిమ్మల, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆరోపణలుంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఇద్దరినీ కమిటీ కోరింది. కూటమికి నష్టం కలిగే విధంగా వ్యవహరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దామచర్ల జనార్దన్‌కు మంత్రి అచ్చెన్న ఫోన్ చేసి చెప్పగా.. బాలినేని శ్రీనివాసరెడ్డితో జనసేన అగ్రనేతలు మాట్లాడారు. బాలినేని, దామచర్ల సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.