Politics7th Sep 10:29 AMSunil Byrisetty1 min read
రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు టీడీపీ శ్రీకారం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్,
టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తూ రాజకీయాల్లో టీడీపీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, నేతలు నివాళులర్పించారు. లీడర్షిప్ కాంక్లేవ్‌లో భాగంగా మొత్తం 10 అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం-పార్టీ మధ్య అనుసంధానం, వనరుల సమర్థ వినియోగం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం, ఎల్ నినో ప్రభావం వంటి వాటిపై సమాలోచనలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజా ప్రతినిధుల నుంచి టీడీపీ అధినాయకత్వం ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది.