Politics4th Jun 04:05 PMSunil Byrisetty1 min read

వైసీపీ వెన్నుపోటు దినోత్సవం హాస్యాస్పదం

వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచి అప్రజాస్వామిక పాలన సాగించిన జగన్మోహనరెడ్డి వెన్నుపోటు దినోత్సవం ప్రకటించటం హాస్యాస్పదం అని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి

వైసీపీ వెన్నుపోటు దినోత్సవం హాస్యాస్పదం
వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచి అప్రజాస్వామిక పాలన సాగించిన జగన్మోహనరెడ్డి వెన్నుపోటు దినోత్సవం ప్రకటించటం హాస్యాస్పదం అని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ గత అయిదు సంవత్సరాలుగా వాక్ స్వాతంత్య్రం కోల్పోయే విధంగా ప్రజలను భయపెట్టి పాలించిన ఫలితమే ప్రజలు జగన్ పాలనకు చరమగీతం పాడి, ఈరోజున స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కల్పించుకున్నారన్నారు. వెన్నుపోటు దినోత్సవం పేరిట వైసీపీ జరిపే కార్యక్రమాలపై తమ కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము ఏ కార్యక్రమం చేపట్టినా గృహ నిర్బంధాలు, పోలీసులతో మార్చ్ ఫాస్టులు చేయించి భయానక వాతావరణం కల్పించిన విషయం ప్రజలు మరిచిపోలేదని అన్నారు. జగన్ పుణ్యమా అని దారి తప్పిన వ్యవస్థలను తిరిగి దారిలోకి తేవడం చాలా కష్టంగా ఉందన్నారు. ప్రజలు పాతరేసిన భూతం తిరిగి లేచే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అరాచక వాదులకు జగన్మోహనరెడ్డి అండగా నిలుస్తారనడానికి ఆయన తెనాలి పర్యటన నిరూపించిందన్నారు. జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి పశ్చాతాపం, పరివర్తన లేదని ప్రజలు గమనించాలన్నారు.
Andhra Pradesh news
AP Politics
TDP MLA buddha Prasad
Ys jagan
Vennupotu dinam
వైసీపీ వెన్నుపోటు దినోత్సవం హాస్యాస్పదం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
Scroll for the next article