News16th Jun 04:23 PMSunil Byrisetty1 min read
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వ
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి తల్లికి పూర్తిస్థాయిలో నిజమైన ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసిందని, రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించిందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా, అవినీతితో గందరగోళంగా మారిందని, ఈ పరిస్థితిని సరిచేయడానికి మంత్రి లోకేష్ ధైర్యంగా ముందుకొచ్చి ఒక్క సంవత్సరంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు చదువు మానేశారని, ఇది వైసీపీకి తొలగని మచ్చగా మిగిలిందన్నారు. వైసీపీ హయాంలో 88 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, కేవలం 42 లక్షల మందికి మాత్రమే ‘అమ్మఒడి’ అందించారని మేము 67.27 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా సహాయం అందించామన్నారు. గత ప్రభుత్వం కంటే 25 లక్షల మంది విద్యార్థులకు అదనంగా అందించామన్నారు. ప్రతి విద్యార్థికి రూ. 13వేలు అందజేసి, రూ. 2వేలు కలెక్టర్ ఖాతాలో జమ చేసి, పాఠశాల సౌకర్యాలు, విద్యా కమిటీల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.