News29th Jan 01:37 PMSunil Byrisetty1 min read
సీమకు తీరని ద్రోహం చేసిన జగన్
రాయలసీమను వ్యవసాయ, సాగునీటి రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి సీమ ప్రజలకు సీమ రైతాంగానికి జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్
రాయలసీమను వ్యవసాయ, సాగునీటి రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి సీమ ప్రజలకు సీమ రైతాంగానికి జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు ద్రోహం చేసిన క్రెడిట్ జగన్‌దేనన్నారు. జగన్ పాలనలో ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో సీమ ప్రాజెక్టులకు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే... చంద్రబాబు పాలనలో 2014-19లో రూ.12,011 కోట్లు ఖర్చు చేశారని లెక్కలు చెప్పారు. ఈ 19 నెలల కూటమి ప్రభుత్వంలో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమ హక్కులకు కాపాడేందుకు కృష్ణా జలాల్లో 512 టీఎంసీల నీటిని సాధించిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసి తద్వారా గోదావరి వరద జలాలైన 3 వేల టీఎంసీల నుంచి 200 టీఎంసీలను వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమలసాగర్ తరిలించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమను సస్యశామలం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కరువు సీమలో ఉద్యాన సిరులు పండించేలా చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.