Politics23rd Oct 04:52 PMSunil Byrisetty1 min read

వైసీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై ఎస్‌ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగించిన దౌర్జన్యాలు, అరాచకలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు నేడు తెలుగుదేశ

వైసీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై ఎస్‌ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగించిన దౌర్జన్యాలు, అరాచకలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు నేడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. హనుమంతునిపాడు, కృష్ణగిరి, కురవపల్లి, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, యడ్లపాడు, చౌడేపల్లి, ధర్మవరం, మాచర్ల ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సాగించిన దాడులు, విధ్వంసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్.రాజశేఖర్‌, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ లతో కూడిన బృందం ఎన్నికల కమిషనర్‌కు సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. హనుమంతునిపాడు, కృష్ణగిరి, కురవపల్లి, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, యడ్లపాడు, చౌడేపల్లి, ధర్మవరం, మాచర్ల తదితర ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు, పోలీసులపై వైసీపీ గూండాలు సాగించిన దౌర్జన్యాలు, బెదిరింపులు, వాహనాల ధ్వంసానికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఎన్నికల కమిషనర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటిలాగే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర పన్నిందన్నారు.
Scroll for the next article