News10th Jun 04:40 PMSunil Byrisetty1 min read
టీడీపీ కొత్త ప్లాన్.. జూలై నుంచి ఇంటింటికీ!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంలో టీడీపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జూలై 1 నుంచి గడపగడపకు టీడీపీ నేతలు వెళ్లే కార్యక్రమాన్ని ప్రార
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంలో టీడీపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జూలై 1 నుంచి గడపగడపకు టీడీపీ నేతలు వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రజల్లో పార్టీ హవా పెంచేలా వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ పార్టీని ప్రజలతో అనుసంధానించేలా ఈ కార్యక్రమం ఉండనుంది.