Politics7th Sep 01:37 PMSunil Byrisetty1 min read
నాయకత్వ పటిమకు కొత్త దిశ చూపించేలా "టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్"
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న "తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్" ఘనంగా ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న "తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్" ఘనంగా ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కాంక్లేవ్, పార్టీకి కొత్త దిశానిర్దేశం చేయడంతో పాటు నాయకత్వ నిర్మాణంలో సరికొత్త శకానికి నాంది పలకనుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
పార్టీని బలోపేతం చేయడం, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకులు తమ ప్రతిభను, నాయకత్వ పటిమను ఎలా పెంపొందించుకోవాలో ఈ కాంక్లేవ్‌లో ప్రత్యేకంగా చర్చిస్తున్నామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, భవిష్యత్ కార్యాచరణపై పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.