News28th May 02:08 PMSunil Byrisetty1 min read
ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి!
రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. ఆరు శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు
రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు.
ఆరు శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు.
ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు.
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలన్నారు. 43 ఏళ్ళుగా టీడీపీ జెండా రెపరెపలాడుతోందంటే అది కార్యకర్తల త్యాగం అని చెప్పుకొచ్చారు.
ఈ ఆరు శాసనాలను చివరి వరకు తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.