Politics17th Aug 01:08 PMSunil Byrisetty1 min read
వివాదంలో అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ అవుతోంది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా తీవ్ర వ
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ అవుతోంది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆడియో షేక్ చేస్తోంది. తెలుగు యువత నేత ధనుంజయ నాయుడుతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసాద్.. సినిమా ప్రదర్శనకు అనుమతి ఉందా అంటూ బూతులతో రెచ్చిపోయారు. వార్ 2 సినిమా ఆడదంటూ పదే పదే చెప్పిన ఎమ్మెల్యే ప్రసాద్ ఆడియో లీక్ కలకలం రేపుతోంది. అయితే ఆ ఆడియో తనది కాదంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఖండించారు. మార్ఫింగ్ చేసి, రాజకీయ కుట్రలో భాగంగానే ఆడియో వైరల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.