Politics23rd Aug 01:38 PMSunil Byrisetty1 min read
కోర్టులో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరు
మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. 2023 సెప్టెంబర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిలకల
మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. 2023 సెప్టెంబర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేటలో టీడీపీ శ్రేణులతో చేపట్టిన ధర్నాకు సంబంధించిన కేసు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమ అరెస్ట్ జగన్ ప్రభుత్వ నిరంకుశత్వం, నియంతృత్వ వైఖరికి పరాకాష్టగా నిలిచిందన్నారు. ఆనాడు జగన్ దుశ్చర్యలపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ అట్టుడికిందని అన్నారు.