Politics28th Jun 02:56 PMSunil Byrisetty1 min read
కూటమి పాలనను విమర్శించే హక్కు వైసీపీకి లేదు
కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత, స్థాయి వైసీపీకు లేదని, గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసిపి వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలను తప
కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత, స్థాయి వైసీపీకు లేదని, గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసిపి వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. రామచంద్రపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు మదన పడుతూ వారి ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను గుర్తు చేస్తూ వైసీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలోనే 90 శాతం ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.. వైసీపీ నాయకులకు కనిపించుట లేదా.. అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు, పింఛన్లు పెంపు, మహిళలకు దీపం పథకం, మహిళల గౌరవం పెంచేలా తల్లికి వందనం అమలు చేశామని, ఆగస్టు 15 నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం,త్వరలో అన్నదాత సుఖీభవ, పథకాలన్నీ అమలు చేస్తామని వివరించారు.