News18th Aug 03:54 PMSunil Byrisetty1 min read
సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్సీ మంతెన
ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇటీవల 32 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా కేబినెట్ ర్యాంకుతో ఉండే సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పదవి
ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇటీవల 32 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా కేబినెట్ ర్యాంకుతో ఉండే సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పదవికి సంబంధించి జీవో విడుదలైంది. ముఖ్యమంత్రి వ్యవహారాల సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజును నియామకం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం, పాందువ్వ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజును దీని కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.