Politics2nd Apr 09:10 AMSunil Byrisetty1 min read
ఎంపీకి సైకిల్ గిఫ్ట్.. పార్లమెంటుకూ దానిపైనే!
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఏం చేసినా వినూత్నంగా ఉంటుంది. తాజాగా ఏపీలోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి ఆయన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు క
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఏం చేసినా వినూత్నంగా ఉంటుంది.
తాజాగా ఏపీలోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి ఆయన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు కార్యకర్తలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుకు ఓ సైకిల్‌ను అపురూప బహుమతిగా ఇచ్చారు.
తనకు ఇచ్చిన ఆ సైకిల్‌ను ఆయన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకి బహూకరించారు.
పార్లమెంటుకు ఎంపీ కలిశెట్టి సైకిల్‌పై వెళ్లి వస్తుంటారన్న విషయం తెలిసిందే.
స్థానికంగానూ తిరిగేందుకు వీలుగా ఈ సైకిల్‌ను అశోక్ గజపతిరాజు అందించారు.