Politics28th Jul 05:26 PMSunil Byrisetty1 min read
ఏపీలో పారదర్శకంగా మెగా డీఎస్సీ
పేపర్ లీక్ నిరోధక బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. పేపర్ లీక్ అయిన వెంటనే చర్యలు తీసుకున్నారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మళ్లీ వెంటనే నీట్ పరీక్ష నిర్వహించా
పేపర్ లీక్ నిరోధక బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. పేపర్ లీక్ అయిన వెంటనే చర్యలు తీసుకున్నారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మళ్లీ వెంటనే నీట్ పరీక్ష నిర్వహించారన్నారు.ఆధారాలు, సాక్ష్యాల సేకరణకు సమయం పడుతుందని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా బాధ్యులను శిక్షించలేమని తెలిపారు. ఏపీలో పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించామని, ఏపీలో నిజాయితీగా 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని వైసీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. నీట్ కోసం విద్యార్థులు ఐదేళ్లపాటు చదువుతారన్నారు. విద్యను వ్యాపార కోణంలో చూడకూడదని, కోచింగ్ సెంటర్లలోనూ అనేక మార్పులు రావాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.