Politics28th Jul 05:13 PMSunil Byrisetty1 min read
నిన్న ఉమా.. నేడు నెహ్రూ.. టీడీపీలో కలకలం
రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. తాను ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు రాజకీయ ఉద్దేశాలతో వెళ్లలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా బ్లాక్‌మె
రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. తాను ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు రాజకీయ ఉద్దేశాలతో వెళ్లలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా బ్లాక్‌మెయిల్ చేయడం కోసం ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని, దానిపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్ ట్రాప్‌లో కొందరు టీడీపీ నేతలు పడుతున్నారని నెహ్రూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరైన వ్యాఖ్య కాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలకు ఒక్క అంశాన్ని మాత్రమే కారణంగా చెప్పడం సమంజసం కాదన్నారు జ్యోతుల నెహ్రూ.. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మెజారిటీ కాపులు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.