Politics11th Jul 01:20 PMSunil Byrisetty1 min read

గవర్నర్ పదవికి టీడీపీ సీనియర్ నేత?

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కలిసొస్తోంది. టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో బీజేపీక

గవర్నర్ పదవికి టీడీపీ సీనియర్ నేత?
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కలిసొస్తోంది. టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో బీజేపీకి రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరించిన టీడీపీకి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉండగా..పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కను న్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలో నూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు.
Andhra Pradesh news
ap politics
governor post
TDP
BJP
NDA alliance decisions
Ashok Gajapathi Raju
Yanamala Ramakrishnudu
ఏపీలో బీజేపీకి రాజ్యసభ సీట్ల కేటాయింపు
Scroll for the next article