Politics6th Apr 10:40 AMSunil Byrisetty1 min read
కార్యకర్తకు అండగా టీడీపీ.. మరణించినా భరోసా
కార్యకర్తలను కుటుంబంలా చూసుకునే తెలుగుదేశం పార్టీ, వారి కష్టకాలంలో అండగా నిలుస్తోంది. బాపులపాడు మండలం, ఏ.సీతారామపురం గ్రామ వాస్తవ్యులైన టీడీపీ కార్యకర్త జంపన వెంకటేశ్వరరావు(69) ఇటీ
కార్యకర్తలను కుటుంబంలా చూసుకునే తెలుగుదేశం పార్టీ, వారి కష్టకాలంలో అండగా నిలుస్తోంది.
బాపులపాడు మండలం, ఏ.సీతారామపురం గ్రామ వాస్తవ్యులైన టీడీపీ కార్యకర్త జంపన వెంకటేశ్వరరావు(69) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.
ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా నుంచి రూ 5 లక్షలు మంజూరు చేశారు.
టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్న వెంకటేశ్వరరావుకు పార్టీ బీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకి స్థానిక నాయకులు తెలియజేశారు.
బీమా పొందేందుకు కావలసిన పత్రాలను కుటుంబ సభ్యులతో పూర్తి చేయించి, త్వరితగతిన మంజూరు చేసేలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంప్రదింపులు జరిపారు.
పార్టీ నుంచి మంజూరైన రూ 5 లక్షల చెక్కును వెంకటేశ్వరరావు సతీమణి జంపన వెంకటేశ్వరమ్మ, కుమారుడు జంపన హరికృష్ణకు అందజేశారు.
మరణానంతరం కూడా కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
కార్యక్రమంలో టీడీపీ నేతలు దయ్యాల రాజేశ్వరరావు, పట్టా సురేష్, నక్కా ప్రసాద్, శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నితీష్, వెంకటేశ్వరరావు, సూరిబాబు, శ్రీధర్ పాల్గొన్నారు.