Politics10th Apr 01:02 PMSunil Byrisetty1 min read

వైఎస్‌ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్త సస్పెండ్‌

ఏ పార్టీ వాళ్లు మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినా ఉపేక్షించేది లేదని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీలకతీతంగా మహిళలపై దూషణలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికలు పంపింది. మాజీ సీఎం జగ

వైఎస్‌ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్త సస్పెండ్‌
ఏ పార్టీ వాళ్లు మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినా ఉపేక్షించేది లేదని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీలకతీతంగా మహిళలపై దూషణలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికలు పంపింది. మాజీ సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్‌ చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్‌పై కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వారితోపాటు సొంత పార్టీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
Chebrolu Kiran
TDP Suspends I TDP Activist
YS Bharathi
గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్‌పై కేసు నమోదు
మహిళలపై అసభ్యకరంగా పోస్టులు
Scroll for the next article