Politics6th Oct 11:05 AMSunil Byrisetty1 min read

నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల సస్పెండ్

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్య

నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల సస్పెండ్
రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అలాగే, ఫేక్ లేబుల్స్, వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎ1గా అద్దేపల్లి జనార్ధన్ రావు అనే వ్యక్తిని గుర్తించామని, నకిలీ మద్యాన్ని విక్రయించిన రాక్ స్టార్ లైసెన్స్ టి రాజేష్ అనే వ్యక్తి పేరిట ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు గుర్తించామని అధికారులు వివరించారు. స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపై కూడా సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒక ప్రణాళికతో అద్దేపల్లి జనార్ధన్ రావు ఏర్పాటు చేసిన ఈ లిక్కర్ తయారీ కేంద్రానికి కొందరు స్థానికుల సహకారం కూడా ఉన్నట్టు గుర్తించామని అధికారులు వివరించారు. ఏ1 జనార్ధన్ రావు, ఏ2 కొట్టారాజు, ఏ5 పి రాజేష్, ఏ12 కె శ్రీనివాసరావులును అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉండటంతో వారిని సస్పెండ్ చేశారు.
Andhra Pradesh Politics
Dasaripalli Jayachandra Reddy
TDP
Katta Surendra Naidu
Mulakalacheruvu
Fake Liquor Case
Palla Srinivas Rao
Chandrababu Naidu
నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల సస్పెండ్
Scroll for the next article