News15th Jul 12:21 PMSunil Byrisetty1 min read

కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్న టీడీపీ బృందం

కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ బృందం భేటీ కానుంది. రాజకీయ పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులపై ఎన్నికల సంఘం సూచనలు తీసుకుంటోంది. అలాగే ఓటరు జాబితా సవరణలు, ఇటీవల సుప్రీంకోర్టు చేసిన

కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్న టీడీపీ బృందం
కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ బృందం భేటీ కానుంది. రాజకీయ పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులపై ఎన్నికల సంఘం సూచనలు తీసుకుంటోంది. అలాగే ఓటరు జాబితా సవరణలు, ఇటీవల సుప్రీంకోర్టు చేసిన పలు మార్గదర్శకాలపై చర్చ జరపనుంది. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకుంటోంది. ఈసీ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ బృందం చర్చకు హాజరుకానుంది. పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఎన్నికల సంఘాన్ని కలవనుంది. టీడీపీ బృందంలో పల్లా శ్రీనివాసరావు, దగ్గుమళ్ల ప్రసాదరావు, శబరి, కూన రవికుమార్, జ్యోత్స్న తదితరులు ఉన్నారు.
Andhra Pradesh news
Election Commission
TDP
Voter list
Supreme Court
Lavu Srikrishna Deva Rayalu
కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్న టీడీపీ బృందం
Scroll for the next article