Politics31st Oct 03:56 PMSunil Byrisetty1 min read

పోలింగ్ కాప్చర్ చేయాలని టీడీపీ ప్రయత్నాలు

పోలింగ్ కేంద్రాలను కాప్చర్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 900కుపైగా మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 2000 వేల

పోలింగ్ కాప్చర్ చేయాలని టీడీపీ ప్రయత్నాలు
పోలింగ్ కేంద్రాలను కాప్చర్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 900కుపైగా మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 2000 వేల మంది గూండాలను తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిరోజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నామని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా SEC పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. YSRCP కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారని, ప్రతి ఒక్కరు పోరాడైనా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Scroll for the next article