Politics26th Jan 03:46 PMSunil Byrisetty1 min read
టీడీపీ కేంద్ర కార్యాలయంలో 100 అడుగుల జెండా
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే విధంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ ప
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే విధంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ పద్ధతిలో 100 అడుగుల భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ 100 అడుగుల భారీ జెండాను అత్యాధునిక సాంకేతికతతో రిమోట్ సహాయంతో ఆవిష్కరించేలా ప్రత్యేకంగా రూపొందించారు. పల్లా శ్రీనివాసరావు రిమోట్ నొక్కగానే జెండా ఆవిష్కృతం కావడంతో కార్యాలయ ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం టీడీపీకి సాంకేతికతపై ఉన్న మక్కువను, అప్-డేటెడ్ విజన్‌ను మరోసారి చాటిచెప్పింది. జెండా ఆవిష్కరణ అనంతరం నేతలందరూ కలిసి భక్తిశ్రద్ధలతో "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతాన్ని ఆలపించారు. అనంతరం కార్యకర్తలు పెద్ద ఎత్తున "చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి", "లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ చేసిన నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది.