Politics29th Jul 05:40 PMSunil Byrisetty1 min read
గీత దాటితే ఉపేక్షించేది లేదు!
టీడీపీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పని చేయాలని, పార్టీ గీత దాటితే ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తామని, తీరు మారకపోతే వేటు తప్పదని ఆ పార్టీ రాష్ట్ర
టీడీపీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పని చేయాలని, పార్టీ గీత దాటితే ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తామని, తీరు మారకపోతే వేటు తప్పదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ప్రజలందరూ అపారమైన విశ్వాసంతో కూటమికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు మనపై ఉంచిన ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత అభిప్రాయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో చేసే పనులు పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పడాలన్నారు. పార్టీకి విఘాతం కలిగించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని వారు తేల్చి చెప్పారు.