Politics5th Aug 11:02 AMSunil Byrisetty1 min read
పులివెందులలో మాదే విజయం
రాబోయే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామంలో నిర్వ
రాబోయే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ నెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. రాబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి గెలుపు తథ్యమని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు ఎవ్వరూ మరిచిపోలేదని మంత్రి సవిత గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు.