Politics7th Aug 12:26 PMSunil Byrisetty1 min read

రాజకీయ పార్టీలకు విరాళాల వరద

రాజకీయ పార్టీలు విరాళాల వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న జాబితా తాజాగా విడుదలైంది. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీ

రాజకీయ పార్టీలకు విరాళాల వరద
రాజకీయ పార్టీలు విరాళాల వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న జాబితా తాజాగా విడుదలైంది. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.612 కోట్ల విరాళాలు రాగా, రూ.495.52 కోట్లతో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో బిజూ జనతాదళ్ (రూ.245 కోట్లు), టీడీపీ (రూ.174 కోట్లు), వైసీపీ (రూ.121 కోట్లు) నిలిచాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు లెక్కలు వెల్లడయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తీర్పు ఇవ్వడానికి ముందు జమైన విరాళాల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. 2023-24లో దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మొత్తం రూ.1820 కోట్లు అందాయి. మొత్తం విరాళాలలో 60 శాతం కంటే ఎక్కువ వాటా డీఎంకే, టీఎంసీ, వైసీపీ, టీడీపీలదే.
Andhra Pradesh
Electoral Bonds
ADR Report
TDP
YSRCP
Trinamool Congress
BRS
Biju Janata Dal
Political Funding
రాజకీయ విరాళాలు
ప్రాంతీయ పార్టీలు
సుప్రీంకోర్టు
భారత రాజకీయాలు
ఎన్నికల నిధులు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article