Politics30th Oct 12:28 PMSunil Byrisetty1 min read
టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ.172 కోట్లు
చిత్తూరు జిల్లా గుడిపాల జెడ్పీటీసీకి స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మమతశ్రీ పోటీ చేస్తున్నారు. పోటీ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు చూసి అధికారులు ఖంగు తిన్నార
చిత్తూరు జిల్లా గుడిపాల జెడ్పీటీసీకి స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మమతశ్రీ పోటీ చేస్తున్నారు. పోటీ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు చూసి అధికారులు ఖంగు తిన్నారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ ఏకంగా రూ.172 కోట్లు ఉండటం అవాక్కయ్యేలా చేసింది. ఇందులో రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు, ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు పేరిట కలిపి రూ.32 కోట్ల రుణాలు, మొత్తం ఆస్తుల విలువ నుంచి ఈ రుణాలను తీసివేస్తే రూ.140.27 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబానికి మొత్తం 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, నివాస భవనాల విలువ రూ.24.89 కోట్లు ఉన్నట్లు చూపించారు. అలాగే మమతశ్రీ వద్ద 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి, భర్త మొగిలీశ్వర నాయుడు పేరిట మూడు సరకు రవాణా వాహనాలు, మరో మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబానికి ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.9.28 కోట్లుగా చూపించారు.