Politics5th Aug 05:48 PMSunil Byrisetty1 min read
10 రోజుల్లో 26.98 లక్షల ఇళ్ సందర్శన
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇం
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 10వ రోజు రాష్ట్రవ్యాప్తంగా 3.35 లక్షల ఇళ్లను సందర్శించగా గత 10 రోజుల్లో మొత్తంగా 26.98 లక్షల ఇళ్లను సందర్శించి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను టీడీపీ శ్రేణులు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరును ప్రతి ఇంటికీ చేరవేశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 10 రోజుల్లోనే ఇంటింటి సందర్శనలు 26.98 లక్షల మార్క్ దాటడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.