Education3rd Sep 12:28 PMSunil Byrisetty1 min read
అర్హత లేకుండానే టీచర్? అక్రమాలు నిజమేనా?
కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీలో అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకు
కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీలో అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్‌లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విచారణ కమిటీ ధ్రువీకరించడంతో వైసీపీ ఆరోపిస్తున్నట్లు డీఎస్సీలో అక్రమాలు నిజమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.