News21st Sep 05:39 PMSunil Byrisetty1 min read
ఉపాధ్యాయులపై వైసీపీ దాడులా?
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురువుల
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురువులపై రౌడీ మూకలతో దాడులు చేయించడం దారుణమని, ఈ చర్యను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారం ఉన్నా.. లేకపోయినా దాడుల సంస్కృతిని వైసీపీ వీడటం లేదని విమర్శించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపట్టడాన్ని వైసీపీ ఓర్వలేకనే ఉపాధ్యాయులపై దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయులంటే జగన్‌కు గిట్టదు కాబట్టే గతంలో వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని, ఇప్పుడు అదే గురువులపై దాడులు చేయిస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు.